Vijayakanth Health Update: కోలీవుడ్ సీనియర్ హీరో విజయ్ కాంత్ హాస్పిటల్ పాలయ్యాడు. గత మూడు రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో విజయ్ కాంత్ బాధపడుతోన్నారు. వాటికి తోడు ఇటీవల జ్వరం, జలుబుతో పాటు దగ్గు సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.