Kushi Pre Release Business: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియన్ లెవెల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భార్యాభర్తల మధ్య ఉండే అపోహాల్ని, అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి మూవీని తెరకెక్కిస్తోన్నాడు. లైగర్ డిజాస్టర్‌గా మిగిలినా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.