Kushi Movie Comparisons: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఓ జంట ప్రేమ, పెళ్లి బంధం నేపథ్యంలో ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మణిరత్నం సఖి, ఓకే బంగారంతో పాటు దిల్ సే సినిమాల స్ఫూర్తితో శివ నిర్వాణ ఖుషి కథను రాసుకున్నారంటూ విమర్శలొచ్చాయి. ఈ కంపేరిజన్స్‌పై ఖుషి ప్రమోషన్స్‌లో శివ నిర్వాణ రియాక్ట్ అయ్యాడు.