Krishna Mukunda Murari Today Episode: కృష్ణను రేవతి, మధుకర్ సపోర్ట్ చేయడం భవానీ సహించలేకపోతుంది. ముకుంద మాటలను గుడ్డిగా నమ్ముతుంది. నువ్వు చనిపోయావని కృష్ణ మా అందరికి అబద్ధం చెప్పిందని మురారితో అంటుంది భవానీ. ఇంటికి మరొకరి డెడ్‌బాడీ పంపించిందని చెబుతుంది. కృష్ణ, మురారిల అగ్రిమెంట్ మ్యారేజీ గురించి మాత్రం దాచిపెడుతుంది. ఆమె మాటలను మురారి నమ్మడు. చెప్పుడు మాటలు నమ్మి కృష్ణను భవానీ ద్వేషిస్తుందని అనుకుంటాడు.