మీరంటే నాకు అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. కృష్ణ ఏం చెబుతుందా అని మురారి ఆసక్తిగా ఎదురుచూస్తాడు. మీరంటే నాకు గౌరవం, అభిమానం అని అంటుంది. మురారికి ముగ్గులు వేయడం నేర్పిస్తుంది కృష్ణ. ఆ సమయంలో కృష్ణ చేతి పట్టుకొని ఆమెనే చూస్తూ ఉండిపోతాడు మురారి. ముగ్గు వేసే టైమ్‌లో కృష్ణ, మురారి మధ్య దూరం మరింత తగ్గుతుంది చనువు పెరుగుతుంది. ఇద్దరు ప్రేమ మైకంలో మునిగిపోతారు. ఆ సీన్‌ను దూరం నుంచి ముకుంద చూసి సహించలేకపోతుంది.