Chinna OTT Streaming: సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ వీడింది. నవంబర్ 28 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. తొలుత ఈ సినిమా ఓటీటీలో నవంబర్ 17న రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అదే రోజు చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెనక్కి తగ్గింది.