అరుణ్ బ్లాక్ మెయిల్
మా ఇంటి దగ్గరకు ఎందుకు వచ్చావని అరుణ్‌ను అడుగుతుంది స్వప్న. భయాన్ని నీకు పరిచయం చేయడానికే నీ ఇంటికి వచ్చానని స్వప్నకు బదులిస్తాడు అరుణ్. నాకో పది లక్షలు కావాలని స్వప్నను అడుగుతాడు. నేనేం తప్పు చేయలేదని, నువ్వు ఇంటికి వచ్చినాఎలాంటి సమస్య లేదని, డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదని అరుణ్‌తో అంటుంది స్వప్న. నేను ఇంటికి రానని, నాతో సంబంధం ఉన్నట్లుగా గ్రాఫిక్స్‌లో ఫొటోలు తీసి కొరియర్ చేస్తానని స్వప్నను బెదిరిస్తాడు అరుణ్. అత్తారింట్లో నీపై నమ్మకం లేదు, పుట్టింటిలో పరువు లేదు కాబట్టి నీకే ఇబ్బంది అవుతుందని భయపెడతాడు. అరుణ్ మాటలతో స్వప్న కంగారు పడుతుంది. అంత డబ్బు తాను సర్ధలేనని అరుణ్‌ను బతిమిలాడుతుంది. స్వప్న మాటలను పట్టించుకోకుండా రేపటివరకే నీకు టైమ్ ఉంది. అప్పటిలోగా డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు ఇంటికి కొరియర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు అరుణ్.