టోటల్ థియేట్రికల్ రన్‌లో కేవలం ముప్పై కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి నిర్మాతకు పెద్ద షాక్ ఇచ్చింది. వాల్తేర్ వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవి నటించిన మూవీ కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో భోళాశంకర్‌ను నిర్మాత అనిల్ సుంకర రిలీజ్ చేశారు. కానీ పేవలమైన కథ, కథనాలు, కామెడీ కారణంగా అందులో సగం కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది.