హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ- బుద్వేల్, గండిపేట, కోకాపేట్ లో మరిన్ని ప్రాజెక్టులు-hyderabad real estate sector witness investments from it banking financial services knight frank report ,తెలంగాణ న్యూస్


హైదరాబాద్ లో పెట్టుబడులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి.. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల నుంచి పెట్టుబడులను కొనసాగుతాయని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. హైదరాబాద్‌లో ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల నుంచి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వర్టికల్స్ కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. డేటా సెంటర్, ఇ-కామర్స్ కోసం వేర్‌హౌసింగ్, ఇతర పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూలంగా మారిందన్నారు. హెచ్‌ఎన్‌ఐలు.. పెద్ద పరిమాణాల్లో, ఎత్తైన భవనాలు, మరిన్ని సౌకర్యాలు, ఖరీదైన ఇంటీరియర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంతో హైదరాబాద్‌లో హౌసింగ్ ఉన్నత స్థాయికి చేరుకుంటోందని ఆయన చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదల కారణంగా.. బుద్వేల్, గండిపేట, కోకాపేట్ ప్రాంతాల్లో మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఆర్థర్ తెలిపారు. 2047 నాటికి $36 ట్రిలియన్‌లకు ఆర్థిక విస్తరణకు మద్దతుగా 69 శాతం మంది శ్రామిక జనాభా ఉపాధి పొందుతారని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.Source link

Leave a Comment