సెప్టెంబర్ 19వ తేదీనే వినాయక చవితి, మండపాలకు పోలీసుల పరిష్మన్ తప్పనిసరి కాదు!-hyderabad ganesh chaturthi utsavas minister talasani review with bhagyanagar ganesh utsav committee ,తెలంగాణ న్యూస్


హైదరాబాద్ లో 32 వేల మండపాలు

హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో వినాయక చవితి ఏర్పాట్లు, మండపాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులతో సమావేశం అయ్యారు. ప్రతీ ఏటా గణేశ్‌ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ తో పాటు చుట్టుపక్కల 32,500 వరకు వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 19వ తేదీన వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం అవుతాయని, 28న నిమజ్జనం జరిగేంత వరకు బందోబస్తు ఉంటుందన్నారు. బందోబస్తుకు తెలంగాణ పోలీసులతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.Source link

Leave a Comment