నటుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సెప్టెంబర్ 2021 నెలలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్ని వారాల పాటు కోమాలో ఉన్నాడు. తర్వాత ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతని స్నేహితుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ(Naveen Vijay Krishna) ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నవీన్ తన వద్ద ఉన్న బైక్స్ అన్నీ అమ్మేశాడు.