Sankranti 2024 Movies: తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు కీలకమైన పండుగ సంక్రాంతి (Sankranti Festival 2024). అందుకే పెద్ద హీరోలు అందరూ ఈ ఫెస్టివల్‍కే తమ సినిమాలను విడుదల చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తెగింపు, ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు వచ్చే ఏడాది అంటే సంక్రాంతి 2024కు పోటీ పడే సినిమాలపై ఆసక్తి నెలకొంది.