నారాయణ పాదములు
తిరుమల శ్రీ వారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీ వారి శ్రీపాద ముద్రలున్న శిలాఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది. వీటినే “నారాయణ పాదములు” అంటారు. ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ, ఛత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను, బంగారు బావి తీర్థాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు.