మేషరాశి వార పంచాంగం
మేషరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. ధనలాభం. అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి మీరు విజయం సాధిస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. మేషరాశివారు ఈవారం మరింత ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తిని పూజించాలి. ఆది, మంగళ, శనివారాల్లో రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి. శుభం కలుగుతుంది.