గతంలో ఏపీ హైకోర్టు తీర్పు
వాన్‌పిక్ ఆస్తుల అటాచ్‌మెంట్ చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే 11,804.78 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో 1,416 ఎకరాల రిలీజ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 2014, 2017లో వాన్‌పిక్‌కు చెందిన 13,221 ఎకరాలను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ చర్యను పీఎంఎల్ఏ అప్పీలేట్ ట్రిబ్యునల్ సమర్థించింది. వాడరేవు – నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ పేరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రాజెక్టు ఇది.