ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని
జ్యోతి కుమార్ యాదవ్ (35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. దీపావళి సెలవులకు తన స్వస్థలమైన తిరుపతికి వచ్చారు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూసిన జ్యోతి కుమార్ యాదవ్…ఇండియా ఓటమి చెందడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతి కుమార్ యాదవ్ మృతి పట్ల తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ మోహిత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలోని ఆయన నివాసానికి సోమవారం వెళ్లి మోహిత్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.