Cyber Crime : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షలు కొట్టేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా… కొందరు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక.. అంతా లైక్ లు, షేర్స్ పై అంటూ యువత పరుగులు పెడుతున్నారు. సరిగ్గా దీనిని క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ తరహా మోసం జరిగింది. టెలిగ్రామ్ యాప్ లో మెసేజ్ లకు లైక్ లు కొడితే డబ్బులిస్తామని లక్షలు దోచేశారు.