బ్రహ్మముడి సీరియర్ ఆగస్ట్ 26వ ఎపిసోడ్‍లో (Brahmamudi Serial 26th Episode) కావ్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది. అమ్మమ్మగారు కాఫీ తీసుకోండి అని కావ్య అంటే.. తనతో ఎవరూ మాట్లాడకూడదు అని అపర్ణ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఇందిరా దేవి. దీంతో కాఫీ తీసుకోకుండానే ఇందిరా దేవి వెళ్లిపోతుంది. ఇంతలో అపర్ణ ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్య కాఫీ అని కావ్య అంటే.. ధాన్య లక్ష్మీ అని గట్టిగా అరిచిన అపర్ణ.. మన పనులు మనమే చేసుకోవాలని చెప్పాగా. ఎవరో కాఫీ ఇస్తే తీసుకోవాలా అని కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి, స్వప్నకు కాఫీ ఇచ్చిన తీసుకోరు. దీంతో కావ్య బాధపడుతుంది.