మోకిల ప్లాట్లకు నాల్గో రోజూ భారీ డిమాండ్, రేపటితో ముగియనున్న ఫేజ్-2 వేలం-hyderabad mokila plots e auction fourth day high demand second phase completes ,తెలంగాణ న్యూస్


భారీ డిమాండ్

హైదరాబాద్ మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు మంచి ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్ లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05, 000ల వరకు రేట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్-2 లో 300 ప్లాట్లకు వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండో రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.Source link

Leave a Comment