లక్కీ డ్రాలో ద్వారా బహుమతులు
మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. అత్యంత పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారని, సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారని గుర్తుచేశారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో ఈ పండుగ నాడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని తెలిపారు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వేయాలని సూచించారు. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోందన్నారు. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు.