రక్షా బంధనం అంటే..
ఆ తర్వాత ఇదే కంకణ సూత్ర ధారణంగా మారి మిగతా కులాలవారిలో రక్షాబంధన కర్మగా ఏర్పడి ఉంటుంది. రక్షాబంధనాన్ని ఇదే రోజున చేసుకోవడం వల్ల ఈ శ్రావణ పూర్ణిమకు “రక్షాపూర్ణిమ, రాఖీ పూర్ణిమ” అనే పేర్లు ఏర్పడ్డాయి. అసలు ఈ రక్షాబంధనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు శ్రీ కృష్ణపరమాత్మను అడిగాడట. అప్పుడు కృష్ణుడు, పూర్వం దేవాసురయుద్ధం ఘోరంగా జరిగినప్పుడు, ఇంద్రుడు పరాజితుడై సహచరులతో అమరావతిలో తలదాచుకున్నాడు. దానితో దానవరాజు త్రిలోకాలను తన అధీనంలోకి తెచ్చుకోగా దేవపూజలు మూలనపడ్డాయి. పూజలు లేకపోవడంతో సురపతి బలమూ సన్నగిల్లింది. అప్పుడు అమరావతిలోని ఇంద్రుని మీదకు మళ్ళీ రాక్షసులు దండెత్తి వచ్చారు.