బరువును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సొరకాయ రసం చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. కర్రీలా చేసుకుని తినొచ్చు. దీన్ని జ్యూస్‌గా తాగడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా?