ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రను ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వాలని నెటిజన్లు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా వారి వినతిని మన్నించారు. “ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని గిఫ్టుగా ఇవ్వమని చాలా మంది కోరుతున్నారు. కానీ, నా మనసులో మరో ఆలోచన ఉంది. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు తమ కొడుకుని చిన్నప్పటి నుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి కృతజ్ఞతగా, పోత్సాహకరంగా మహీంద్ర XUV400 EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.