Heart Attack: ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరు చెప్పలేరు. కోవిడ్ తర్వాత కాలంలో అనూహ్య మరణాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, ఆడుతూ పాడుతున్న వారు అనూహ్యంగా మృత్యువాత పడుతున్న ఘటనలు చాలా జరిగాయి. సెలబ్రిటీలు మొదలుకుని రాజకీయ నాయకుల వరకు పూర్తి ఫిట్నెస్‌తో ఉన్న వారు కూడా ఇలా అనూహ్యంగా గుండెపోటు మరణాలకు గురైన ఉదంతాలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి.