ఫీజులు కూడా విద్యార్దులు సొంతంగానే కట్టుకోవాల్సి ఉంటుంది. ఏటా సుమారు 10శాతం మంది విద్యార్థులు స్పాట్ కోటాలో సీట్లు పొందుతుండగా ఇకపై వాటిని రద్దు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫలితాలు వెల్లడించిన 81 రోజులకు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో చేరిపోయారు. ఈ ఏడాది పాలిటెక్నిక్‌లలో సగం సీట్లు కూడా భర్తీకాలేదు. 269 పాలిటెక్నిక్‌లలో 82,729 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 34,122 (41.2శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 36.6శాతం సీట్లే నిండాయి. ప్రైవేటు యాజమాన్యాలు కూడా స్పాట్ అడ్మిషన్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఎక్కడా సీటు రానివారు స్పాట్ ద్వారా సీట్లు పొందుతారని, దానివల్ల తమ అడ్మిషన్లు పెరుగుతాయని భావించగా వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.