దరఖాస్తులో అత్యధికంగా ఇల్లెందు ఎస్టీ నియోజక వర్గంలో పోటీ చేసే విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి 36మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని గుర్తించిన నియోజకవర్గాలకు బీసీ, ఓసీ అభ్యర్ధులు ఎక్కువగా పోటీపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎల్బీనగర్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీ దరఖాస్తు ఇచ్చారు.