నిద్రించే ముందు నో కెఫీన్
నిద్రించే సమయం దగ్గరయ్యే కొద్దీ మీరు కెఫీన్, చక్కెరతో కూడిన స్నాక్స్‌కు నో చెప్పండి. ఎందుకంటే ఇవి మీ నిద్ర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. తద్వార మీ మొటిమల సమస్య ఎక్కువ అవుతుంది. ఒకవేళ పడుకునే ముందు ఆకలితో ఉంటే.. తేలికపాటి, సమతుల్యమైన చిరుతిండిని తీసుకోండి. అంతేకానీ నిద్రకు కనీసం గంట ముందు నుంచి కెఫీన్, స్వీట్లకు మాత్రం దూరంగా ఉండండి.