ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు
జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బల్ షెల్టర్ కుంగిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘మీరు కట్టడం అయ్యింది. కూలడం కూడా అయ్యింది జగన్మోహన్ రెడ్డి’ అంటూ సెటైర్లు వేశారు. విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో నిర్మించిన మోడల్ బస్ షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలిందని విమర్శించారు. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. రాష్ట్రంలో బస్సులు తిరగడానికి సరైన రోడ్డులు లేవు కానీ, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇలా ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఒక చిన్న బస్ షెల్టర్ ను సక్రమంగా కట్టలేని వాళ్లు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.