టీడీపీ హయాంలోనే బోగస్ ఓట్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సీఈసీని ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో భారీగా నకిలీ ఓటర్లను చేర్చారని, వాటిని ఇప్పుడు తొలగించామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న విజయసాయి రెడ్డి… అవి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్రమంగా చేర్చారని ఆరోపించారు. 2019లో ఎన్నికలకు ముందు ఏపీలో 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఓ లక్ష ఎక్కువే ఓటర్లు ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలోనే భారీగా నకిలీ ఓట్లు చేర్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తుందని ఈసీకి వివరించామని విజయసాయి అన్నారు.