తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ బలం ఇస్తే, క్రెడిట్ కేసీఆర్ కొట్టేశారు- మల్లికార్జున ఖర్గే-chevella congress meeting aicc president mallikarjun kharge criticizes brs bjp internal relationship ,తెలంగాణ న్యూస్


మోదీకి భయపడే ప్రసక్తే లేదు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. భూసంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామన్నారు. బ్యాంకులను జాతీయీకరణ, నరేగా చట్టం తెచ్చింది ఎవరు? ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అనేక సంస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఏర్పాటుచేసిందన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందంటే రాజీవ్‌ గాంధీ కారణమన్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయన్నారు. తాను 12 ఎన్నికల్లో పోటీ చేస్తే 11 సార్లు విజయం సాధించానన్నారు. మోదీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 66 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలను కమిటీల్లోకి తీసుకున్నామన్నారు.Source link

Leave a Comment