తెలంగాణలో కోకా కోల సంస్థ పెట్టుబడులు రెట్టింపు.. కొత్తగా రూ. 647 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్-cocacola has decided to double its investments in telangana ,తెలంగాణ న్యూస్


తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనిడానికి తాజాగా కోకా కోల సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకవైపు ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలే కాకుండా, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకా కోల తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండవ తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు మేక్ గ్రీవికి తెలియజేశారు.Source link

Leave a Comment