మీరు టీ లవర్ అయితే.. అల్పాహారం, భోజనం చేసిన తర్వాత టీ తాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. టీ మీ జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. మీరు ఆహారంతో ప్రోటీన్ తీసుకుంటే, టీ నుండి వచ్చే యాసిడ్ ప్రోటీన్ పదార్థాన్ని గట్టిపరుస్తుంది, జీర్ణం కావడం కష్టమవుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరం ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే భోజనానికి ఒక గంట ముందు, తర్వాత రెండు గంటల వరకూ టీకి దూరంగా ఉండండి.