మొత్తం 29 మందితో
టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను సీఎం కార్యాలయం దేవదాయ శాఖకు పంపించింది. ఆ జాబితాకు దేవదాయ శాఖ ఇన్‌ఛార్జ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీటీడీ నూతన పాలకమండలి ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉండగా మరో 24 మందితో ప్రభుత్వం బోర్డును ప్రకటించింది. టీటీడీ ఛైర్మన్, సభ్యులతో పాటు మరో ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులు బోర్డులో ఉంటారు. దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌తో పాటు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులు వెలువడ్డాయి. టీటీడీ ఈవో ఎక్స్‌అఫిషియో మెంబర్ సెక్రటరీగా ఉంటాయి. ఛైర్మన్‌తో కలిపి మొత్తం 29 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి బోర్డు ఏర్పాటుచేశారు.