ఎడిట్ కు అవకాశం
సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 20 నుంచి అభ్యర్థులు టీఎస్ సెట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్, విజయవాడతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టీఎస్ సెట్ దరఖాస్తుల కోసం www.telanganaset.org వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.