పోషకరమైన ఆహారం..
ఫ్యాటీ లివర్ సమస్యను తిప్పికొట్టాలంటే అన్నింటికన్నా మీరు ముందు చేయాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్‌లు, స్వీట్స్, ప్యాక్డ్ చేసిన ఆహారపదార్థాలను పూర్తిగా నివారిస్తే మీ ఆరోగ్యం ముందుగా గడిలోపడేందుకు ప్రయత్నిస్తుంది. వీటికి బదులుగా మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆకుకూరలు వంటి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.