అప్పుడే కేదార్ తల్లి ఫొటో కిందపడి పగిలిపోతుంది. ఆ ఫొటోలో అతని తల్లి భుజంపై ఇంకొకరి చెయ్యి ఉండటాన్ని గమనిస్తుంది ధాత్రి. అది కచ్చితంగా కేదార్ తండ్రిదే అయ్యింటుందని, నమ్మకంతో ఉండమని చెబుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతని చేతికి ఉన్న ఉంగరం స్టోరీ ఏంటి? కేదార్ ధాత్రికి బహుమతిగా ఇచ్చిన చీరను రేఖ ఏం చేస్తుంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 30న ప్రసారమయ్యే జగద్ధాత్రి సీరియల్ చూడాల్సిందే!