నటరాజ స్వామి బొటనవేలు కింద ఈ భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు ఉందని పూర్వీకులు కనుగొన్నారు. అందుకనే ఈ క్షేత్రానికి అంతటి విశిష్టత. పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశమూ, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ, కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ, కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అనీ అంటారు. ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి.