బెయిల్ వస్తే నిర్దోషి అయిపోరు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. సీఎం నిధులు విడుదల చెయ్యమంటేనే విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలిపారు. నిధుల విడుదలకు చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారన్నారు. చంద్రబాబు 70 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని కోర్టును కోరారన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రమే అంతా అయిపోలేదన్నారు. బెయిల్ కోసం చంద్రబాబుకు గుండె జబ్బు నుంచి చాలా రోగాలు ఉన్నట్లు చూపించారన్నారు. టీడీపీ నేతలు స్కిల్ కేసుతో సంబంధం లేదని ఎప్పుడూ మాట్లాడడం లేదని సజ్జల అన్నారు. జైలులో దోమలు ఉన్నాయని, చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్యలు ఉన్నాయని, చర్మ సమస్యలు వచ్చాయని, 70 ఏళ్ల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే దానికి ఆయన నిర్దోషి అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.