కుంకుడు కాయలను దంచి, నానబెట్టి వాటి నుంచి రసాన్ని తీసి తలస్నానం చేసేవారు. దీంతో జుట్టు చాలా అందంగా ఉండేది. వీటిని ఉపయోగించడం వలన.. జుట్టు మురికి కూడా పోతుంది. ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవు.. సహజ సిద్ధంగా దొరుకుతుంది కాబట్టి.. జుట్టుకు హాని కలగదు. ప్రస్తుతం దొరుకుతున్న షాంపూలకంటే.. కుంకుడు కాయలను ఉపయోగించడం చాలా మేలు.