కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యత? ప్రయోజనాలేంటి?-what is the importance of gooseberry in karthika masam amla benefits ,రాశి ఫలాలు న్యూస్


ఉసిరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఉసిరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ ముందుంది. తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. దేశంలో 35 శాతం ఉసిరిని ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే పండిస్తున్నారు. జర్మనీ, అమెరికా, జపాన్‌, మలేషియా తదితర దేశాలకు మన ఉసిరిని ఎగుమతి చేస్తున్నాం. ఔషధ గుణాలు, పోషక విలువల కారణంగా ఉసిరికి ఆయా దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఉసిరిని కాయలాగా చూడకుండా తాజా పండుగా సలాడ్స్ లో వినియోగించవచ్చు. ఇంకా జామ్స్‌, జెల్లీ, పచ్చడి, కూరలు, సిరప్స్‌లో కూడా విరివిగా వాడుతున్నారు. ఉసిరి ఆకులు, కాయలు, పూలపై విశేషంగా జరిపిన పరిశోధనల వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయంటారు వైద్య పరిశోధకులు.Source link

Leave a Comment