వైసీపీ, బీజేపీ లివింగ్ టుగెదర్ రిలేషన్
ఏపీ పాలిటిక్స్ పై మాట్లాడిన సీపీఐ నారాయణ …పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట వీడాలని సూచించారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీ పాలకమండలిలో లిక్కర్ వ్యాపారులకు చోటివ్వడం సరికాదన్నారు. వైసీపీ, బీజేపీ లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఉన్నారని నారాయణ సెటైర్లు వేశారు. వాళ్లు విడిపోరన్నారు. ఏపీలో బీజేపీ ఎంత పోరాడిన వైసీపీని ఓడించే స్థాయికి రాదన్నారు. ఏపీకి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ సహకరించడం మంచిది కాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవుతుందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ పచ్చి అవకాశవాదులని విమర్శించారు. కవిత విషయంలో సీఎం కేసీఆర్ బీజేపీకి తలొగ్గారని అన్నారు.