పైన చెప్పిన మూడు మాత్రమే కాకుండా.. ఇంతకుముందు చెప్పుకొన్నట్టుగా మరికొన్ని కూడా మీరు ధనవంతులు అవుతారని చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా కలలో లక్ష్మీ దేవిని చూస్తే, అది చాలా పవిత్రమైన కలగా చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల వస్తే మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరలో ధనవంతులు అవుతారు. కానీ ఏ కారణం చేతనైనా, మీ కలను మరెవరితోనూ పంచుకోకండి. కొన్ని కలలు మీ మనసులోనే పెట్టుకోవాలి. బయటకు చెప్పకూడదని స్వప్న శాస్త్రం చెబుతుంది.