ఏపీ సెట్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ఏ తేదీల్లో అంటే?-ap higher education department released counselling schedule different cets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP CETs Counselling Schedules : ఏపీ ఉన్నత విద్యామండలి వివిధ సెట్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి పలు సెట్స్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంటెక్, ఎంఫార్మసీల్లో అడ్మిషన్ల కోసం పీజీ ఈసెట్ కు వచ్చే నెల 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఐసెట్‌ కౌన్సెలింగ్ ను సెప్టెంబర్ 6వ తేదీ నుంచి, పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పించే పీజీ సెట్‌ కౌన్సెలింగ్ ను సెప్టెంబర్ 11వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. బీపీఈడీ, యూజీడీ, పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే పీఈసెట్‌కు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 3, 5 సంవత్సరాల ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్ కు సెప్టెంబర్ 26న కౌన్సెలింగ్ జరగనుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ఎడ్‌సెట్ కు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి, ఏపీ ఈఏపీ సెట్ లో నాన్ ఎన్‌ఆర్‌ఐ, క్యాట్ బీ, ఇంజినీరింగ్ కోర్సులకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు.



Source link

Leave a Comment