గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, జిల్లా అధికారులు అందరూ కలిసి సెప్టెంబరు 4వ తేదీలోపు వంద శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్) సాధించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,993 మంది వాలంటీర్లు వంద శాతం జీఈఆర్ పూర్తి చేశారని పేర్కొన్నారు. 100 శాతం జీఈఆర్ పూర్తయ్యాక డేటాబేస్ తప్పు ఉందనిగాని… ఏ పిల్లలైనా ఈ డేటాబేస్‌లో నమోదు కాలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ జీఈఆర్ పై దృష్టి పెట్టాలని సూచించారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని, పాదర్శకంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.