సీఎం కేసీఆర్ హామీ
రాష్ట్రంలోని 3,645 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలుచేస్తున్నారు. త్వరలో మరో 2,796 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరింపజేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో 6,441 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం హామీ మేరకు దేవాదాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప దీప నైవేద్యం పథకం అమల్లోకి తెచ్చింది. ముందుగా అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా ఇచ్చారు. ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏ మాత్రం సరిపోని కారణంగా 2015 జూన్ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6 వేలకు పెంచారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే వేతనాలను రూ.10 వేలకు పెంచింది.