అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు-secunderabad news in telugu south central railway 22 special trains to kerala sabarimala temple ,తెలంగాణ న్యూస్


Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమల క్షేత్రానికి మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, నర్సాపుర్‌-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్‌ -కొట్టాయం మధ్య స్పెషల్ ట్రైన్స్ ఆయా రోజుల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.Source link

Leave a Comment