ఈ విషయాన్ని జొనాథన్ సెల్వరాజ్ అనే నెటిజన్ ట్వీట్‍లో పేర్కొన్నాడు. “హిందీ బాగా మాట్లాడే ఓ స్వీట్ హంగేరియన్ యువతి నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరింది. దానికి నీరజ్ ఒప్పుకున్నాడు. కానీ, ఆమె భారత జాతీయ పతాకంపై ఇవ్వాల్సిందిగా కోరింది. లేదు. అక్కడ సంతకం చేయలేను. మీ టీషర్ట్ స్లీవ్‍పై ఇస్తాను అని నీరజ్ చోప్రా సంతకం చేశాడు. దానికి ఆమె తెగ సంతోషపడిపోయింది” అని రాసుకొచ్చాడు జొనాథన్. ఈ ట్వీట్ వైరల్ కాగా ‘ఇదే కదా అసలైన దేశభక్తి’, ‘నీకు మన దేశం పట్ల ఉన్న గౌరవానికి హ్యాట్సాఫ్’ అంటూ నెటిజన్లు నీరజ్ చోప్రాను ప్రశంసిస్తున్నారు.